భద్రాద్రి కొత్తగూడెం, 2026-07-25
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వానపల్లి శ్రీరామూర్తి సతీమణి వానపల్లి అనసూర్య మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వానపల్లి శ్రీరామూర్తి గారి సతీమణి వానపల్లి అనసూర్య గారు మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు చీమలమర్రి మురళీకృష్ణ, చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ నాయుడు, చర్ల ఉప సర్పంచ్ కాపుల కృష్ణ, వార్డు సభ్యుడు గుండెపూడి భాస్కర్ రావు, సీనియర్ నాయకులు జవ్వాది రవి తదితరులు పాల్గొని వానపల్లి శ్రీరామూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనసూర్య గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.











