Charla, గురువారం
లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ చర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ రాస్తారోకో, నిరసన కార్యక్రమం నిర్వహించారు. చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ నాయుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం చర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోతో పాటు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ విజయ్ నాయుడు మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల శాంతియుత నిరసనకు మద్దతు తెలిపిన శ్రీ రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శ్రీ రాహుల్ గాంధీ గారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చీమల మర్రి మురళి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ఇందుల బుచ్చిబాబు గారు, జిల్లా కమిటీ సభ్యులు సుందర్ సురేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బ్రహ్మానంద రెడ్డి, లంక రాజు, డాక్టర్ రంగారావు, మైప జోగారావు, మాజీ ఎంపిటిసి మడకం పద్మజ, మేడబత్తిని వాసు, తాండవ రాయుడు, గూడపాటి రంజిత్ కుమార్, మాజీ ఎంపిటిసి కుంజా నాగేశ్వరరావు, మేడబత్తిన మనోహర్, నూప కృష్ణ, ఇరప వేణు, శ్రీదేవి, శిరీష, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.











