భద్రాచలం, 03-07-2026
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సమక్షంలో దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కోమరం రంజీత, 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నాయకులు బత్తుల శోభన్, మడకం చంద్రశేఖర్, తెల్లం రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరినట్లు వారు తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సమక్షంలో దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కోమరం రంజీత, 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ చేరికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల శోభన్, గంగోలు మాజీ సర్పంచ్ మడకం చంద్రశేఖర్, నడికుడి మాజీ సర్పంచ్ తెల్లం రామకృష్ణ ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ముర్రం వీరభద్రం వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, అలాగే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేపడుతున్న నియోజకవర్గ అభివృద్ధిని విశ్వసిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చేరికదారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భీమవరపు వెంకటరెడ్డి, యూత్ నాయకులు గాడి విజయ్, ఎండి సుభాని తదితరులు పాల్గొన్నారు.











