Bhadradri Kothagudem/Venkatapuram (సహస్ర) జూలై 09
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని, ఈ డిమాండ్ల సాధన కోసం రేపు నిర్వహించనున్న బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నిచర్, విద్యుత్, ప్రహరీ గోడలు వంటి కనీస సౌకర్యాలు కూడా అనేక చోట్ల అందుబాటులో లేవని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వం తక్షణమే కల్పించాలని, ఈ డిమాండ్ల సాధన కోసం రేపు నిర్వహించనున్న బంద్‌ను ప్రజలు, విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ పిలుపునిచ్చారు.
ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నిచర్, విద్యుత్, ప్రహరీ గోడలు వంటి కనీస సౌకర్యాలు కూడా అనేక చోట్ల అందుబాటులో లేవని అన్నారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకు తగిన నిధులు కేటాయించి అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న బంద్‌కు అన్ని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.









