కరకగూడెం (ప్రజా వాయిస్ సహస్ర) నవంబర్ 19
భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దేశాభివృద్ధికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, పేదల సంక్షేమం, జాతీయ సమైక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, కరపత్రాల ద్వారా వివరాలను తెలియజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎర్ర సురేష్, సర్పంచులు పోలేబోయిన సుజాత, కొమరం సుగుణ, ఎల్లబోయిన ముత్తమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొగ్గలి రవి, ఉపసర్పంచ్ గాంధర్ల రామనాథం, మాజీ ఎంపీటీసీ వట్టం సురేందర్, మాజీ ఉపసర్పంచులు కొమరం వెంకటేశ్వర్లు, బాడిష లక్ష్మీనారాయణ, నాయకులు జాడి శ్రీను, నేతాజీ, భూక్య రాందాస్, పడిగ సమ్మయ్య, బరపటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



