పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే గల్ఫ్ ప్రాంతంలోని సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికలు రూపొందించినట్లు ఇరాన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ భద్రతా అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం అంతర్జాతీయ డిజిటల్ వ్యవస్థపై ఆందోళనలను పెంచుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి కింద ఉన్న సమాచార కేబుళ్లు దెబ్బతింటే గల్ఫ్ దేశాల్లో ఇంటర్నెట్, ఆన్లైన్ చెల్లింపులు, వాణిజ్య కార్యకలాపాలు, క్లౌడ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలను రాయిటర్స్ న ప్రచురించింది.
పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే గల్ఫ్ ప్రాంతంలోని సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికలు రూపొందించినట్లు ఇరాన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ భద్రతా అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం అంతర్జాతీయ డిజిటల్ వ్యవస్థపై ఆందోళనలను పెంచుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి కింద ఉన్న సమాచార కేబుళ్లు దెబ్బతింటే గల్ఫ్ దేశాల్లో ఇంటర్నెట్, ఆన్లైన్ చెల్లింపులు, వాణిజ్య కార్యకలాపాలు, క్లౌడ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలను రాయిటర్స్ న ప్రచురించింది. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి మళ్లీ సైనిక దాడులు జరిగితే సముద్రగర్భ సమాచార కేబుళ్లను లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. దాడుల అనంతరం కేబుళ్ల మరమ్మతులను కూడా అడ్డుకోవడం ద్వారా సమాచార వ్యవస్థలలో అంతరాయాన్ని ఎక్కువకాలం కొనసాగించే ప్రయత్నం చేయవచ్చని ఓ అధికారి పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ రాజకీయ వ్యవహారాల ఉపాధ్యక్షుడు యదొల్లా జవానీ కూడా హార్ముజ్ జలసంధి కింద ఉన్న ఏడు ప్రధాన ఇంటర్నెట్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని గతంలో హెచ్చరించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అయితే, కేబుళ్లపై దాడులు జరిగాయని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఇవి యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే తీసుకోవచ్చని చెబుతున్న చర్యలకు సంబంధించిన హెచ్చరికలు మాత్రమే.
ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య జరిగే ఇంటర్నెట్ సమాచార మార్పిడిలో సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ అంచనాల ప్రకారం, ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో సుమారు 99 శాతం ఈ కేబుళ్ల ద్వారానే ప్రయాణిస్తుంది. బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లు, వీడియో కాల్స్, అంతర్జాతీయ వ్యాపార సమాచార మార్పిడి, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అనేక సేవలు ఈ వ్యవస్థపై ఆధారపడుతున్నాయి. సముద్రం అడుగున ఉండే ఈ కేబుళ్లలోని సన్నని గాజు తంతువుల ద్వారా కాంతి సంకేతాల రూపంలో డేటా వేగంగా ప్రయాణిస్తుంది. హార్ముజ్ జలసంధిలోని కేబుళ్లు దెబ్బతిన్నంత మాత్రాన ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోదని టెలికమ్యూనికేషన్ నిపుణులు చెబుతున్నారు. ఈ మార్గం ద్వారా ప్రయాణించే అంతర్జాతీయ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ ప్రపంచ మొత్తంలో ఒక శాతం కంటే తక్కువగా ఉందని టెలిజియోగ్రఫీ పరిశోధనా సంస్థ వెల్లడించింది. అయితే, గల్ఫ్ దేశాలకు ఈ కేబుళ్లు చాలా ముఖ్యమైనవి. ఒకేసారి అనేక కేబుళ్లు దెబ్బతింటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల్లో ఇంటర్నెట్ వేగం తగ్గడం, ఆన్లైన్ చెల్లింపుల్లో ఆలస్యం, క్లౌడ్ సేవలకు అంతరాయం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమాచారాన్ని మళ్లించగల సామర్థ్యం, అందుబాటులో ఉన్న అదనపు నెట్వర్క్ సామర్థ్యంపై ప్రభావం ఆధారపడి ఉంటుంది.












