చర్ల మండలం చిన్న మిడిసిలేరు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు గ్రామ సర్పంచ్ శ్యామల సీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చిన్న మిడిసిలేరు గ్రామ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, ఉప ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివిధ పదవులలో సమర్థవంతంగా పనిచేస్తూ, కీలకమైన ఆర్ధిక, ఇంధన శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
గ్రామ సర్పంచ్ శ్యామల సీత మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి, అభ్యున్నతికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. మాజీ ఎంపిటిసి మిడియం శోభారాణి మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు చేకూర్చే కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ వేడుకలలో మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











