మానుగూరు, 18 November
సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం మణుగూరు సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఈ దీక్షలను బ్రాంచ్ కార్యదర్శి వై రాంగోపాల్ ప్రారంభించారు.
సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా బుధవారం మణుగూరు సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలను బ్రాంచ్ కార్యదర్శి వై రాంగోపాల్ ప్రారంభించారు.
ఈ దీక్షలకు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి, సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, మండల కార్యదర్శి జక్కుల రాజబాబు హాజరై, రిలే దీక్షలు చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా సరెడ్డి పుల్లారెడ్డి, వై రాంగోపాల్ మాట్లాడుతూ సింగరేణి బకాయి పడ్డ 60 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, ప్రతి నెల మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వంద శాతం ఇన్వాల్టేషన్ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ నియామక పత్రాలను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణిలో రాజకీయాలు ఎక్కువైపోయాయని, కార్మికుల సమస్యల పట్ల సింగరేణి చిత్తశుద్ధితో పనిచేయాలని, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించవద్దని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, మండల కార్యదర్శి జక్కుల రాజబాబు మద్దతు ప్రకటించారు. దీక్షలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఎం వి రామనరసయ్య, వర్కర్స్ యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీ మేకల ఈశ్వర్, అసిస్టెంట్ సెక్రటరీ పుల్లారావు, ఓర్మెన్ ఇంచార్జ్ బి సురేందర్, ఓ సి ఫోర్ పిట్ సెక్రటరీ ఈసం శీను, మణుగూరు ఓసి సెక్రటరీ సాయి ప్రకాష్, నాయకులు ఇమాముద్దీన్, తేనేటి నారాయణ, గుర్రం సుధీర్ ర్తి, సెంట్రల్ కమిటీ కార్యదర్శి బాతుల కృష్ణ పాల్గొనగా, 46 మంది కూర్చోగా, అవుల నాగరాజు మద్దతు ప్రకటించారు.







