వెంకటాపురం, 18 November
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మరికలగ్రామ పంచాయతీలో అర్హులైన 27 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. భద్రాచలం శాసనసభ్యులు తెలం వెంకట్రావు లబ్ధిదారులకు పింఛను మంజూరు పత్రాలతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మరికల గ్రామ పంచాయతీలో అర్హులైన 27 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) తెల్లం వెంకట్రావు లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలతో పాటు అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నూతన పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన గ్రామ సర్పంచ్ కుర్సం కన్నయ్యకు గ్రామ ప్రజలు, లబ్ధిదారులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్సం కన్నయ్య, ఉప సర్పంచ్ బాలసాని రాంప్రసాద్, పింఛన్ లబ్ధిదారులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







