భద్రాద్రి కొత్తగూడెం, 2026-07-25
భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం వికటించి మరణాలు సంభవిస్తున్నాయని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని CPIML మాస్ లైన్ పార్టీ ఆరోపించింది. MIM ఆసుపత్రిలో జరిగిన ఘటనపై వైద్యశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది.
భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో అసలేం జరుగుతోందని, రోగం వస్తే ప్రాణాలు తీస్తున్నారా అని CPIML మాస్ లైన్ పార్టీ ఆరోపించింది. ఒక మనిషి ప్రాణాలకు డబ్బులు ఎలా కడుతున్నారని, రోగికి సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి ఎవరు బాధ్యత వహిస్తారని పార్టీ ప్రశ్నించింది.
MIM ప్రైవేట్ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఎంతమంది వైద్యం వికటించి చనిపోయారని, ఇప్పటివరకు ఆసుపత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పార్టీ నిలదీసింది. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తుంటే వైద్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారని, ఈరోజు MIM హాస్పిటల్లో జరిగిన ఘటనపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది.
అడిషనల్ DMHO భద్రాచలం పట్టణంలో ఉన్నా ఆసుపత్రి వైపు ఎందుకు రాలేదని, DMHO, జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని CPIML మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేసింది.
దంతల బోర సర్పంచ్ వైద్యం వికటించి చనిపోవడం దారుణమని, భద్రాచలంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులపై, ముఖ్యంగా ఘటనలు పునరావృతం అవుతున్న ఆసుపత్రులపై జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పార్టీ ప్రశ్నించింది. ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపింది.
ఈ మేరకు CPIML మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.








