Charla, 2026-07-15
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి ఎస్టీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, వాటి వల్ల కలిగే అనర్థాలు, బానిసత్వం నుంచి బయటపడే మార్గాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హోమియో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూజ ఈ కార్యక్రమానికి ఆధ్వర్యo వహించారు.

ఈ సందర్భంగా డా. పూజ మాట్లాడుతూ, విద్యార్థులు స్నేహితుల ఒత్తిడి లేదా సరదా కోసం గుట్కా, తంబాకు, సారా, బీడీ, సిగరెట్, చుట్ట వంటి మత్తు పదార్థాలను ఉపయోగించడం ప్రారంభిస్తారని, అయితే అవి క్రమంగా తీవ్రమైన వ్యసనంగా మారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు, కుటుంబ జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని వివరించారు. మత్తు పదార్థాలకు బానిసైతే ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా ఎన్నో నష్టాలు ఎదురవుతాయని తెలిపారు.
ముఖ్యంగా విద్యార్థి దశలో ఇటువంటి చెడు అలవాట్లు ఏర్పడితే చదువులో వెనుకబడటమే కాకుండా జీవిత లక్ష్యాలను సాధించలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ వయస్సులో మంచి స్నేహితులను ఎంచుకోవడం, చెడు అలవాట్లు ఉన్నవారితో దూరంగా ఉండడం, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే అలవాటు ఉన్నవారు కూడా నిరుత్సాహపడకుండా, దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే తప్పకుండా వ్యసనం నుంచి బయటపడవచ్చని తెలిపారు. మత్తు పదార్థాలను ఈ క్షణమే విడిచిపెట్టి, వాటికి ప్రేరేపించే స్నేహితులు, అవి లభించే ప్రదేశాలకు దూరంగా ఉంటే త్వరగా వ్యసనం నుంచి విముక్తి పొందవచ్చని పేర్కొన్నారు. 'మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది' అని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.
అనంతరం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు హోమియో మందులు అందజేసి, హోమియో వైద్యం యొక్క ప్రయోజనాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ గోపి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.