Charla, సోమవారం
చర్లలోని గురుదేవ్ విద్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) బృందం ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే వైద్యులు, ఏఎన్ఎమ్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
చర్లలోని గురుదేవ్ విద్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) బృందం ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఆర్బీఎస్కే వైద్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ స్ఫూర్తి, ఏఎన్ఎమ్ సరస్వతి, ఆశా కార్యకర్తలు పి. చంద్రకళ, జి. విజయలక్ష్మి హాజరై విద్యార్థులకు మందులను అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ మాట్లాడుతూ, నులిపురుగులు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. నులిపురుగుల కారణంగా రక్తహీనత, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నులిపురుగుల నివారణ మాత్రలను ప్రతి చిన్నారి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
నులిపురుగుల నివారణ మందు తీసుకోవడం వల్ల పేగుల్లోని నులిపురుగులు నశించి, శరీరానికి పోషకాలు సక్రమంగా అందడంతో పిల్లల ఎదుగుదల మెరుగుపడటంతో పాటు రక్తహీనత తగ్గి, ఆకలి పెరిగి, ఆరోగ్యం, చదువుపై ఏకాగ్రత కూడా మెరుగుపడుతుందని వివరించారు.
ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్.జి.వి. ప్రసాద్, అకడమిక్ కోఆర్డినేటర్లు ఎం.వి. సుబ్రహ్మణ్యం, జి. శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











