తేగడ, 13 July
తేగడ గ్రామంలో 222 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన శివరాత్రి సందర్భంగా భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కళ్యాణం నిర్వహించారు. సోమవారం, ఆర్ద్ర నక్షత్రం, మాస శివరాత్రి కలసి రావడంతో ఆలయ నిర్వాహకులు, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
సోమవారం, ఆర్ద్ర నక్షత్రం, మాస శివరాత్రి కలసి రావడంతో పాటు, 222 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన రోజున తేగడ గ్రామ శివాలయంలో భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు యల్లమందల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో, ఆలయ అర్చకులు భానుప్రకాష్ ఉదయం 5 గంటల నుండి వీరేశ్వర స్వామి వారికి విశేష రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, ఫలాభిషేకాలు జరిపించారు.
ఈ అభిషేకాలకు గుమ్మడి రవీంద్ర బాబు దంపతులు, ఐనవోలు రమేష్ దంపతులు, చర్ల వాస్తవ్యులు, శివ రాజుల రవి కుమార్ దంపతులు, చర్ల ఆయిల్ బంక్ ఏరియా వాస్తవ్యులు దాతలుగా వ్యవహరించారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు లఘు న్యాస పూర్వకంగా అన్నాభిషేకం, బిల్వ దళాలతో శివ అష్టోత్తరం నిర్వహించారు.
సాయంత్రం భద్రకాళీ సమేత వీరేశ్వర (శివ) కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణానికి ఆర్.కొత్తగూడెం వాస్తవ్యులు శ్రీమాన్ ఐతం రాజు, సులోచన దంపతులు దాతలుగా వ్యవహరిస్తున్నారు. నిన్న జరిగిన మహా ప్రదోష కాల నందీశ్వర అభిషేకం, ఈ రోజు ఉదయం, సాయంత్రం కార్యక్రమాల కోసం ప్రత్యక్ష, పరోక్ష దాతలకు, యజమాని దంపతులకు అనేక మంగళాశాసనాలు అందజేశారు.
ఈ సందర్భంగా భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి అనుగ్రహ ప్రసాద సిద్ధి కలుగుతుందని ఆలయ కమిటీ, తేగడ, భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానం, తేగడ గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం తెలియజేసింది.











