భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పరిధిలోని సమితి సింగారం గ్రామపంచాయతీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సంత అంగడి అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి ప్రారంభించారు.
సమితి సింగారం గ్రామపంచాయతీలో డిపో రోడ్డు వద్ద నూతన సంత అంగడి నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యులు మాదాడి రాజేష్, కోలపిన్ని మానస ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాధవరావు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో, వారి అవసరాలను తీర్చేందుకు ఈ సంతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, వార్డు సభ్యులు మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. త్వరలో సంతను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి, గ్రామ ప్రజలకు నాణ్యమైన, తాజా సరుకులు లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు AM చారీ, ఎండి యాకూబ్ అలీ, బొజ్జా త్రిమూర్తులు, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ పనులు పూర్తయితే గ్రామ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని ఆశిస్తున్నారు.









