Charla, 2024-07-19
చర్ల మండలంలోని గొమ్ముగూడెం గ్రామానికి చెందిన కురిచేటి రాఘవేంద్రరావు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసి, అతని బాల్య మిత్రులు ఆదివారం రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన మిత్రులకు రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
చర్ల మండలంలోని గొమ్ముగూడెం గ్రామానికి చెందిన చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎస్ఎస్ సి -2000 బ్యాచ్ విద్యార్థి కురిచేటి రాఘవేంద్రరావు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న సహచర మిత్రులు ఆదివారం అతని నివాసంలో రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న రాఘవేంద్రరావు అనారోగ్యానికి గురవడంతో తమవంతు బాధ్యతగా అందరూ కలిసి సహచర స్నేహితులు, స్నేహితురాళ్ళం అందరం స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ సహాయాన్ని అందించామని తెలిపారు. తమ మిత్రుడు త్వరగా కోలుకుని మళ్లీ సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
కురిచేటి రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, కష్టకాలంలో తమకు అండగా నిలిచి ఆర్థిక సాయం అందించిన సహచర మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బడుగు రాజు, మాణిక్యాలరావు, నవీన్, మీసాల సతీష్, శోభన్ బాబు, పాపారావు, చింతా సతీష్, ఆర్ సతీష్, బాలకృష్ణ, పూజారి రమణయ్య, రవికుమార్, జనార్ధన్, జోగారావు, టి. రాజేష్, రమణాచారి, నరసింహమూర్తి తోటి సహచర మిత్రులు తదితరులు పాల్గొన్నారు.








