Charla, జూలై 5
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు విజయ్ నాయుడు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు విజయ్ నాయుడు సూచించారు.
ఆయన మాట్లాడుతూ, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని హెచ్చరించారు.
వర్షపు సమయంలో రైన్కోట్, గొడుగు, వాటర్‌ప్రూఫ్ షూస్ వంటి రక్షణ సామగ్రిని ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా నీరు నిలిచిన ప్రాంతాలు, మ్యాన్‌హోల్స్ సమీపంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలు, వృద్ధులు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని విజయ్ నాయుడు ఆకాంక్షించారు.








