వెంకటాపురం, 2026-09-03
వెంకటాపురం మండలం కర్రిగుట్ట సమీపంలో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో మృతి చెందిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఐఈడీ పేలుడులో మృతి చెందిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం : ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట సమీపంలో జరిగిన విషాదకర ఐఈడీ పేలుడు ఘటనలో మృతి చెందిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనతో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చి, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ధనపనేని వెంకన్న వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు,సివిల్ కానిస్టేబుల్ మరియు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.








