భద్రాచలం, 2026-07-08
స్వర్గీయ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఘనంగా నివాళులర్పించారు. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, జునియర్ కాలేజీ గ్రౌండ్ వద్ద వైఎస్సార్ చిత్ర పటానికి, విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ప్రజాహృదయ నాయకుడు, స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఘనంగా నివాళులర్పించారు. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, జునియర్ కాలేజీ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ చిత్ర పటానికి, విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్సార్ ప్రజల సంక్షేమాన్ని జీవిత లక్ష్యంగా చేసుకున్నారని కొనియాడారు. రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ప్రజాసేవకు ఆయన చూపిన అంకితభావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.












