Charla, 15 October
సీతారామ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి కేవలం రూ.20 లక్షల పరిహారం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఎకరానికి రూ.35 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీతారామ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి కేవలం రూ.20 లక్షల పరిహారం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సత్యనారాయణపురం గ్రామంలోని రైతు వేదికలో అధికారులు నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొన్న సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ, మండలంలోని సత్యనారాయణపురం, ఆర్.కొత్తగూడెం, కుదునూరు, దేవరపల్లి గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న భూములకు ఎకరానికి కేవలం రూ.20 లక్షల పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
సీతారామ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.35 లక్షల పరిహారంతో పాటు ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దుమ్ముగూడెం మండలంలో రైతులకు ఎకరానికి రూ.30 లక్షల పరిహారం ఇస్తూ, మండలంలో మాత్రం రూ.20 లక్షలు మాత్రమే ఇవ్వడం వివక్షకు నిదర్శనమని ఆయన ఆరోపించారు.
ఈ విధానాన్ని ప్రభుత్వం మార్చుకోకపోతే న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రైతులను ఐక్యం చేసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ (ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్) డివిజన్ నాయకులు గొంది మొయిన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.












