దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. వాహనాల కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం () గడువును వాహనం వయస్సు, దాని ఉద్గార ప్రమాణాల ఆధారంగా సవరించింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
కొత్త నిబంధనల ప్రకారం, ఆరేళ్లలోపు వయస్సున్న ప్రైవేటు వాహనాలకు ఇకపై మూడేళ్లకు ఒకసారి పీయూసీ సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది. గతంలో వీటికి సాధారణంగా ఏడాదికి ఒకసారి సర్టిఫికెట్ రెన్యువల్ చేయాల్సి వచ్చేది. అయితే, ఆరేళ్లకు మించి పదేళ్లలోపు వాహనాలకు ఏడాదికి ఒకసారి, పదేళ్లకు పైబడిన వాహనాలకు ఆరు నెలలకు ఒకసారి రెన్యువల్ తప్పనిసరి.
వాణిజ్య వాహనాల విషయంలో, ఆరేళ్లలోపు వాహనాలకు రెండేళ్ల గడువు కల్పించారు. ఆరేళ్లకు మించి పదేళ్లలోపు వాహనాలకు ఏడాది, పదేళ్లకు పైబడిన వాటికి ఆరు నెలల గడువు ఉంటుంది. ఇక పాత ఉద్గార ప్రమాణాలున్న వాహనాలకు గడువును తగ్గించారు. -, -, - వాహనాలకు మూడు నెలలకు ఒకసారి, - వాహనాలకు ఆరు నెలలకు ఒకసారి పీయూసీ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలి.
ఇప్పటికే పీయూసీ సర్టిఫికెట్ పొందిన వాహనదారులు వెంటనే మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సర్టిఫికెట్ గడువు ముగిసే వరకు అది చెల్లుబాటులో ఉంటుంది. కొత్త గడువులు తదుపరి రెన్యువల్ సమయంలో వర్తిస్తాయి. సర్టిఫికెట్ గడువు ముగియడానికి పది రోజుల ముందు రెన్యువల్ చేసుకుంటే, కొత్త సర్టిఫికెట్ పాతది ముగిసిన తేదీ నుంచి అమలవుతుంది.


