Charla, 2023-08-25
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని చర్ల మండలం తేగడ గ్రామ పంచాయతీ సర్పంచ్ జమ్ముల మురళీకృష్ణ అన్నారు. తేగడ గ్రామానికి చెందిన పొన్నపు సంతోష్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థి నిలయంలో భోజన ఏర్పాట్లు చేశారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని చర్ల మండలం తేగడ గ్రామ పంచాయతీ సర్పంచ్ జమ్ముల మురళీకృష్ణ అన్నారు. తేగడ గ్రామానికి చెందిన పొన్నపు సంతోష్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా పాకాలపాటి సత్యనారాయణరాజు మిత్రులు చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం/శబరి బాలికా విద్యార్థి నిలయం విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు.
విద్యార్థుల అభ్యున్నతికి కృషి
ఈ సందర్భంగా నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్పంచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్థుల అభ్యున్నతికి విద్యార్థి నిలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
విద్యతోనే జీవితం
విద్యతోనే మానవజాతి మనుగడ ముడిపడి ఉన్నదని, కుటుంబంలో ఒక్కరు చదువుకొని జీవితంలో స్థిరపడితే ఆ కుటుంబం మొత్తం స్థిరపడుతుందని పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని, సంస్థ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు చదువులపై దృష్టిసారించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.








