మలేషియాలో పర్యాటకులుగా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై భారత హైకమిషన్ హెచ్చరిక జారీ చేసింది.
ఈ నిర్ణయం వెనుక కారణమేంటి
మలేషియాలో ఉద్యోగాల కోసం పర్యాటకులుగా వెళ్లి 30 రోజుల వీసా మినహాయింపును దుర్వినియోగం చేస్తూ ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ గతంలో హెచ్చరించింది. పర్యాటక అనుమతితో వెళ్లి ఉద్యోగాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, కొందరు ఏజెంట్ల తప్పుడు ఉద్యోగ హామీలకు మోసపోవద్దని సూచించింది. అయితే వీసా మినహాయింపు రద్దుకు ఇదే ఏకైక కారణమని మలేషియా అధికారిక ప్రకటన స్పష్టం చేయలేదు.


