డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, అయినవిల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సిరిపల్లి జడ్పీ హైస్కూల్ నందు విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పోక్సో చట్టం, రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించారు.
సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, కొత్తపేట డిఎస్పి, పి.గన్నవరం సి.ఐ, మరియు అయినవిల్లి ఎస్సై ల పర్యవేక్షణలో ఈ సదస్సు జరిగింది.
విద్యార్థులు తమ భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు వంద మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.











